• Login / Register
  • జాబ్ న్యూస్‌

    TGPSC|వ‌చ్చే మార్చిలో గ్రూప్స్ ఫ‌లితాలు

    TGPSC|వ‌చ్చే మార్చిలో గ్రూప్స్ ఫ‌లితాలు
    పోటీ ప‌రీక్ష‌ల‌కు ఏ పుస్త‌కం చ‌దువాలో అభ్య‌ర్థి ఇష్టం
    స‌ర్వీస్ క‌మిష‌న్ కేవ‌లం సిల‌బ‌స్ మాత్ర‌మే విడుద‌ల చేస్తుంది
    టీజీపీఎస్సీపై న‌మ్మ‌కం ఉంచి ప‌రీక్ష‌లు రాయండి
    నూత‌న ఛైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం వెల్ల‌డి
    గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు 54 శాతం విద్యార్థులు హాజ‌రు
    Hyderabad : రాష్ట్ర‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఇప్ప‌టికే నిర్వ‌హించిన గ్రూప్‌-1, గ్రూప్‌-3 వంటి ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను   వ‌చ్చే ఏడాది మార్చి నాటికి విడుద‌ల చేస్తామ‌ని టీజీపీఎస్సీ నూత‌న‌ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం తెలిపారు. అలాగే ఆదివారం, సోమ‌వారం నిర్వ‌హించే గ్రూప్-2 ప‌రీక్ష‌ల‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే టీజీపీఎస్సీ కేవ‌లం సిల‌బ‌స్ మాత్ర‌మే ఇస్తుంద‌ని, ఏ బుక్ చ‌ద‌వాల‌న్న‌ది అభ్య‌ర్థుల ఇష్ట‌మ‌ని ఆయ‌న చెప్పారు. అయితే రాష్ట్రంలో గ్రూప్-2 ప‌రీక్ష‌లు ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు వాయిదా పడింది. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు,హైకోర్టు వంటి వాటిలో గ్రూప్-2 ప‌రీక్ష‌ల‌కు ఉన్న ర‌కాల‌  అడ్డంకులు తొలగిపోయాయి. అయితే 5 లక్షల 51 వేల మంది గ్రూప్-2 కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ ప‌రీక్ష కోసం 75 శాతం మాత్ర‌మే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌పై న‌మ్మ‌కం ఉంచి ప‌రీక్ష‌లురాయండి. ఎవ‌రి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుంది. ప్ర‌తి అభ్య‌ర్థికి బ‌యోమెట్రిక్ త‌ప్ప‌నిస‌రి. వేగంగా గ్రూప్-2 ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఇస్తాం. ప‌ది రోజులుగా అన్ని అంశాల‌ను స‌మీక్షించుకున్నాం. ప‌రీక్ష‌లు సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతాయని టీజీపీఎస్సీ చైర్మ‌న్ పేర్కొన్నారు.
    * అయితే ఈ మేర‌కు ఆదివారం నిర్వ‌హించిన గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 54 శాతం మంది అభ్య‌ర్థులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. మిగిలిన 46 శాతం విద్యార్థులు మాత్రం ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాలేదు. వారంతా ఇత‌ర ఉద్యోగాల‌కు ఎంపిక కావ‌డం వ‌ల్ల గ్రూప్‌-2 పోస్టుల‌ను వ‌దులుకున్న‌ట్లు తెలుస్తుంది. 
    *  *  *

    Leave A Comment